స్పుత్నిక్ వీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన దేశం?
Sakshi Education
కరోనా మహమ్మారితో విలవిలలాడుతున్న రష్యా తాను సొంతంగా తయారు చేసిన ‘స్పుత్నిక్ వీ’ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డిసెంబర్ 5న ప్రారంభించింది.
ఫ్రంట్‌లైన్ వర్కర్లకే టీకాలు ముందుగా ఇవ్వాలని రష్యా ప్రభుత్వం నిర్ణయించింది. వేలాదిగా ఆరోగ్య సిబ్బంది, మున్సిపల్ వర్కర్లు, టీచర్లు, వైరస్ ముప్పు అధికంగా ఉండే ఇతరులు భారీ సంఖ్యలో వ్యాక్సిన్‌లు తీసుకోవడానికి ముందుకు వచ్చారు. ఈ వ్యాక్సిన్ 95 శాతం పని చేస్తుందని తేలింది. అయితే ఇంకా ఈ వ్యాక్సిన్‌పై మూడో దశ ప్రయోగాలు జరుగుతున్నాయి.
గమలేయా ఇన్స్‌స్టిట్యూట్...
రష్యాలోని గమలేయా ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీ అండ్ మైక్రోబయాలజీ కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి డోసు ఇచ్చిన 21 రోజుల తర్వాత రెండో డోసు ఇస్తారు.
రష్యా రాజధాని: మాస్కో; కరెన్సీ: రష్యన్ రూబుల్;
రష్యా ప్రస్తుత అధ్యక్షుడు: వ్లాదిమిర్ పుతిన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్పుత్నిక్ వీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 5
ఎవరు : రష్యా
ఎక్కడ : రష్యా
ఎందుకు : కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు

Published date : 07 Dec 2020 05:36PM