Skip to main content

స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర

2021, మార్చిలో భారీ స్థాయి స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ డిసెంబర్ 16న ఆమోదముద్ర వేసింది.
Current Affairs ఈ బిడ్డింగ్ ద్వారా 2,251.25 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను విక్రయిచనున్నారు. ఈ మొత్తం స్పెక్ట్రమ్ కనీస వేలం ధర (బేస్ ప్రైస్) రూ.3.92 లక్షల కోట్లుగా అంచనా. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం...
  • 700, 800, 900, 2100, 2300, 2500 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్‌‌త ఫ్రీక్వెన్సీల్లో 2,251.25 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ వేలంలో అందుబాటులో ఉంటుంది.
  • మొత్తం 20 ఏళ్ల వ్యవధికి గాను ఈ బిడ్డింగ్‌లో స్పెక్ట్రమ్‌ను దక్కించుకోవచ్చు.
  • బేస్/రిజర్వ్ ధర ప్రకారం ఇప్పుడు వేలం వేయనున్న స్పెక్ట్రమ్ విలువ రూ.3,92,332.70 కోట్లు. తమ సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్)లో 3 శాతం వాటాను స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.
  • 5జీ సేవల కోసం నిర్దేశించిన 3,300-3,600 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్‌‌త ఫ్రీక్వెన్సీలను మాత్రం ఈ తాజా వేలంలో విక్రయించడం లేదు.
Published date : 17 Dec 2020 07:05PM

Photo Stories