Skip to main content

సోమశిల ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు హైలెవల్ లిఫ్ట్ కెనాల్ రెండో దశ పనులకు నవంబర్ 9న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు.
Current Affairs

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... రూ.459 కోట్లతో చేపట్టిన లిఫ్ట్ కెనాల్ రెండో దశ పనులు పూర్తయితే ఆత్మకూరు నియోజకవర్గంలో 10,103 ఎకరాలు, ఉదయగిరి నియోజకవర్గంలో 36,350 ఎకరాలకు కొత్తగా నీటి సదుపాయం కలుగుతుందన్నారు.

2022 ఖరీఫ్ నాటికి పోలవరం...

  • జలయజ్ఞం ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు. 2022 ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీళ్లందించే విధంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.
  • వంశధార స్టేజ్-2 ఫేజ్-2, వంశధార-నాగావళి అనుసంధానం, వెలిగొండ తొలి దశ, అవుకు టన్నెల్, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను 2020 ఏడాదే పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : సోమశిల ప్రాజెక్టు హైలెవల్ లిఫ్ట్ కెనాల్ రెండో దశ పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన
ఎప్పుడు : నవంబర్ 9
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : కృష్ణాపురం, మర్రిపాడు మండలం, నెల్లూరు జిల్లా
ఎందుకు : ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో మరిన్ని ఎకరాలకు సాగునీటిని అందించేందుకు
Published date : 10 Nov 2020 05:37PM

Photo Stories