Skip to main content

సొంత రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళ్లనున్న వ్యాపారవేత్త?

అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌(57) తన సొంత రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ‘బ్లూ ఆరిజిన్‌’కు చెందిన రాకెట్‌లో 2021, జూలై 20వ తేదీన టెక్సాస్‌లో నుంచి మొదలయ్యే ఈ యాత్రలో తన తమ్ముడు, ఫైర్‌ ఫైటర్‌ అయిన మార్క్‌ కూడా పాల్గొంటాడని జూన్ 7న బెజోస్‌ తెలిపారు.
Current Affairs మొత్తం 10 నిమిషాల్లో పూర్తయ్యే ఈ ప్రయాణంలో 3 నిమిషాల పాటు భార రహిత స్థితి కూడా ఉంటుంది. బ్లూ ఆరిజిన్‌ నిర్వహిస్తున్న దాతృత్వ వేలంలో అత్యధిక మొత్తం చెల్లించే వారే ఈ ప్రయాణంలో పాల్గొనే మూడో వ్యక్తి అవుతారు. జూన్ 12వ తేదీతో పూర్తయ్యే ఈ వేలంలో ఇప్పటి వరకు ఉన్న అత్యధిక బిడ్‌ రూ.20.38 కోట్లు. ఈ వేలంలో 143 దేశాలకు చెందిన 6 వేల మంది పాల్గొన్నారు. ఆరుగురికే అవకాశం ఉన్న ఈ ప్రయాణంలో మిగతా ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్లూ ఆరిజిన్‌కు చెందిన రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళ్లనున్న వ్యాపారవేత్త?
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌
ఎక్కడ : అమెరికాలోని టెక్సాస్‌లో నుంచి..
Published date : 08 Jun 2021 06:55PM

Photo Stories