Skip to main content

సన్సద్‌ టీవీ సీఈవోగా నియమితులైన రిటైర్డు ఐఏఎస్‌ అధికారి?

లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీలను విలీనం చేయాలని పార్లమెంట్‌లోని ఉభయ సభల అధ్యక్షులు నిర్ణయించారు.
Current Affairs
రెండింటిని కలిపి సన్సద్‌ టీవీగా ఒకే గొడుగు కిందికి తీసుకు వచ్చేందుకు రాజ్యసభ సభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అంగీకరించారు. ఇందుకు సంబంధించి లైసెన్సు కోసం త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు.

సీఈవోగా రవి కపూర్‌...
సన్సద్‌ టీవీ సీఈవోగా రిటైర్డు ఐఏఎస్‌ అధికారి రవి కపూర్‌ను 2021, మార్చి 1వ తేదీ నుంచి ఏడాది కాలానికి నియమిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్‌ ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. రెండు చానెళ్లు విలీనం అయినప్పటికీ లోక్‌సభ, రాజ్యసభ కార్యక్రమాలను ఇప్పటి మాదిరిగానే ప్రసారం చేస్తాయని, సంయుక్త సమావేశంలో ఒకే వేదికపై పనిచేస్తాయని రెండు సభల సెక్రటేరియట్‌ అధికారులు వివరించారు.

క్విక్‌ రివ్యూ
:
ఏమిటి : సన్సద్‌ టీవీ సీఈవోగా రిటైర్డు ఐఏఎస్‌ అధికారి రవి కపూర్‌ నియామకం
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : లోక్‌సభ సెక్రటేరియట్‌
Published date : 03 Mar 2021 06:10PM

Photo Stories