Skip to main content

సంస్కృత వర్సిటీల బిల్లుకు రాజ్యసభ ఆమోదం

కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాల బిల్లు(సెంట్రల్ సాంస్కిృట్ యూనివర్సిటీస్ బిల్-2019)కు మార్చి 16న రాజ్యసభ పలు సవరణలతో ఆమోదం తెలిపింది.
Current Affairs డీమ్డ్ యూనివర్సిటీలైన రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్(న్యూఢిల్లీ), శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్(న్యూఢిల్లీ), రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్ (తిరుపతి)లను సెంట్రల్ వర్సిటీలుగా మార్చేందుకు ఈ బిల్లును రూపొందించారు. తాజా బిల్లు ప్రకారం తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం.. జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయంగా మారనుంది.

చారిత్రక కట్టడాల్లో చోరీలు
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శ్రీ ఆనందవల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న నంది విగ్రహం, కర్ణాటకలోని సదాశివస్వామి గుడిలో రాగి కలశం చోరీకి గురయ్యాయని సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ లోక్‌సభకు తెలిపారు. రక్షిత చారిత్రక కట్టడాల వద్ద 280 మౌలిక సౌకర్యాల కల్పన ప్రాజెక్టులకు అనుమతులిచ్చినట్లు చెప్పారు.

2 వేల నోట్ల ముద్రణ ఆగలేదు: కేంద్ర ప్రభుత్వం
రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేతపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మార్చి 16న లోక్‌సభకు తెలిపారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాల బిల్లు-2019కు ఆమోదం
ఎప్పుడు : మార్చి 16
ఎవరు : రాజ్యసభ
ఎందుకు : పలు డీమ్డ్ యూనివర్సిటీలను సెంట్రల్ వర్సిటీలుగా మార్చేందుకు
Published date : 17 Mar 2020 08:46PM

Photo Stories