సంస్కృత భాషలో పత్రికా ప్రకటన
Sakshi Education
సంస్కృత భాష పరిరక్షణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హిందీ, ఇంగ్లీషులతో పాటు సంస్కృత భాషలోనూ పత్రికా ప్రకటనలను విడుదల చేయనుంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు సీఎం కార్యాలయంలోని సంబంధిత విభాగం దీనిని అమలులోకి తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించిన నమూనా పత్రాన్ని విడుదల చేసింది. దీంతో సంస్కృత భాషలో పత్రికా ప్రకటనలు విడుదల చేయనున్న తొలి ముఖ్యమంత్రిగా యోగి నిలవనున్నారు. మరోవైపు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో సంస్కృత తరగతులను ప్రారంభించాలని యోగి ప్రభుత్వం నిర్ణయించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సంస్కృత భాషలో పత్రికా ప్రకటన
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఉత్తరప్రదేశ్
ఎందుకు : సంస్కృత భాష పరిరక్షణ కోసం
క్విక్ రివ్యూ :
ఏమిటి : సంస్కృత భాషలో పత్రికా ప్రకటన
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఉత్తరప్రదేశ్
ఎందుకు : సంస్కృత భాష పరిరక్షణ కోసం
Published date : 18 Jun 2019 05:40PM