సంఘ సేవకుడు భాగవతుల కన్నుమూత
Sakshi Education
ప్రముఖ సంఘ సేవకుడు, భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు భాగవతుల వెంకట పరమేశ్వరరావు (86) కన్నుమూశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూన్ 9న కన్నుమూశారు. విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలం దిమిలి గ్రామానికి చెందిన భాగవతుల అమెరికాలోని జేన్‌స్టేట్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ పట్టా పొందారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబైలో రీసెర్చ్ అసోసియేట్‌గా కొన్నాళ్లు పనిచేశారు.
1976 నవంబర్‌లో యలమంచిలి సమీప గ్రామం హరిపురంలో బీసీటీ అనే పేరుతో స్వచ్ఛంద సేవా సంస్థను భాగవతుల ఏర్పాటు చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయంపై గ్రామాల్లో ప్రచారం చేసి వినూత్న మార్పునకు కృషి చేశారు. గ్రామ స్వరాజ్యం స్థాపన ధ్యేయంగా స్వగ్రామం దిమిలిలో హైస్కూల్ ఏర్పా టు చేసి అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ సంఘ సేవకుడు కన్నుమూత
ఎప్పుడు : జూన్ 9
ఎవరు : భాగవతుల వెంకట పరమేశ్వరరావు (86)
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : అనారోగ్యం కారణంగా

Published date : 10 Jun 2019 06:07PM