Skip to main content

సంగారెడ్డి కలెక్టర్‌కి పోషణ్ అభియాన్ అవార్డు

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావుకు ‘పోషణ్ అభియాన్ 2018-19’ అవార్డు లభించింది.
దేశరాజధాని న్యూఢిల్లీలో ఆగస్టు 23న జరగనున్న కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డు ప్రధానం చేయనున్నారు. పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని సంగారెడ్డిలో పక్కాగా అమలు చేసి విజయవంతమైందుకుగాను హనుమంతరావుకు ఈ పురస్కారం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పోషణ్ అభియాన్’కార్యక్రమంలో భాగంగా మాతా శిశు సంరక్షణ, గర్భిణుల ఆరోగ్యం, పిల్లల్లో పౌష్టికారం పెంపుదల విషయంపై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించడం, ఆచరించడంలో సంగారెడ్డి జిల్లా తెలంగాణలో తొలి స్థానంలో నిలిచింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
పోషణ్ అభియాన్ 2018-19 అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు
ఎందుకు : పోషణ్ అభియాన్ పక్కాగా అమలు చేసి విజయవంతమైందుకుగాను
Published date : 12 Aug 2019 05:47PM

Photo Stories