స్మార్ట్ ఎయిర్‌ఫీల్డ్ వెపన్ వ్యవస్థల కొనుగోలుకు ఆమోదం
Sakshi Education
త్రివిధ దళాల కోసం రూ. 2,290 కోట్ల విలువైన ఆయుధాలు, ఇతర సాయుధ వ్యవస్థల కొనుగోలు ప్రతిపాదనకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది.
ఇందులో అమెరికా నుంచి కొనుగోలు చేసే 72 వేల ఎస్‌ఐజీ సావర్ తుపాకులు ఉన్నాయి. ఆర్మీ కోసం వీటిని రూ. 780 కోట్లతో కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రక్షణ శాఖకు చెందిన అత్యున్నత నిర్ణయ మండలి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సెప్టెంబర్ 28న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అధ్యక్షతన సమావేశమై ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
స్మార్ట్ ఎయిర్‌ఫీల్డ్ వ్యవస్థ...
రూ. 2,290 కోట్లలో రూ. 970 కోట్లతో నౌకాదళం, వైమానిక దళం కోసం ‘స్మార్ట్ ఎయిర్‌ఫీల్డ్ వెపన్(ఎస్‌ఏఏడబ్ల్యూ)’ వ్యవస్థలను కొనుగోలు చేయాలని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ నిర్ణయించింది. అలాగే ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ క్షేత్రస్థాయి దళాల మధ్య అడ్డంకులు లేని సమాచార పంపిణీ కోసం రూ. 540 కోట్లతో హెచ్‌ఎఫ్ రేడియో సెట్స్‌ను సమకూర్చాలని నిర్ణయం తీసుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్మార్ట్ ఎయిర్‌ఫీల్డ్ వెపన్ (ఎస్‌ఏఏడబ్ల్యూ) వ్యవస్థల కొనుగోలుకు ఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్

Published date : 29 Sep 2020 05:43PM