Skip to main content

సమ న్యాయంలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?

దేశంలో ఆర్థిక, సామాజిక, లింగ సమానత్వం/సమ న్యాయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలోనూ, మొత్తమ్మీద (ఓవరాల్ ర్యాంకింగ్స్)లో తృతీయ స్థానంలో నిలిచింది.
Current Affairs

అక్టోబర్ 31న విడుదలైన పబ్లిక్ ఎఫైర్స్ ఇండెక్స్ (ప్రజా వ్యవహారాల సూచీ-పీఏఐ)-2020లో ఈ విషయం వెల్లడైంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న పబ్లిక్ ఎఫైర్స్ సెంటర్ (పీఏసీ) దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పరిపాలన తీరు తెన్నులపై అధ్యయనం చేసి పబ్లిక్ ఎఫైర్స్ సూచీ-2020ని రూపొందించింది.

మూడు కేటగిరిల్లో...
వివిధ సామాజిక అంశాలపై పరిశోధనలు, అధ్యయనాలు చేయడంలో ప్రసిద్ధి చెందిన పీఏసీ సంస్థ... 23 అంశాల ఆధారంగా ఆర్థిక, సామాజిక, లింగ సమానత్వంలో ప్రగతిని అంచనా వేసింది. ఆయా అంశాల్లో పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను వేర్వేరు విభాగాలుగా అధ్యయనం చేసి ర్యాంకులను ప్రకటించింది. సమన్యాయం, వృద్ధి, సుస్థిర అభివృద్ధి అనే మూడు అంశాలను ప్రాతిపదికగా రాష్ట్రాలకు ఓవరాల్ ర్యాంకింగ్స్ ఇచ్చింది.

పెద్ద రాష్ట్రాల విభాగంలో...

  • పెద్ద రాష్ట్రాల విభాగంలో సమానత్వం/సమ న్యాయం విషయంలో పీఏఐ ర్యాంకింగ్‌‌స 2019లో దేశంలో 9వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 2020లో శరవేగంగా ప్రథమ స్థానంలోకి వచ్చింది.
  • సమ న్యాయం విషయంలో 2020 ర్యాంకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ (0.652 పాయింట్లతో) కేరళ (0.629), ఛత్తీస్‌గఢ్ (0.260 పాయింట్లలో) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.
  • 2019తో పోల్చితే మధ్యప్రదేశ్, ఒడిశా, హరియాణా, ఉత్తరప్రదేశ్ నెగిటివ్ సూచీలతో అట్టడుగు స్థానాలకు దిగజారాయి.

చిన్న రాష్ట్రాల విభాగంలో
...
  • చిన్న రాష్ట్రాల విభాగంలో మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.
  • వృద్ధి విషయంలో కేరళ గతంలో ఉన్న మొదటి స్థానాన్ని నిలబెట్టుకోగా కర్ణాటక మూడో స్థానం నుంచి రెండో స్థానంలోకి ఎగబాకింది. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వరుసగా మూడు, నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్నాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ప్రజా వ్యవహారాల సూచీ-పీఏఐ-2020లో ఆంధ్రప్రదేశ్‌కు అగ్రస్థానం
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : పబ్లిక్ ఎఫైర్స్ సెంటర్ (పీఏసీ)
ఎక్కడ : పెద్ద రాష్ట్రాల విభాగంలో
ఎందుకు : సమన్యాయం అనే అంశానికి సంబంధించి ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు
Published date : 02 Nov 2020 05:44PM

Photo Stories