స్కైట్రాక్స్ అవార్డుకు ఎంపికైన విమానాశ్రయం?
వరుసగా మూడుసార్లు ఈ అవార్డును సొంతం చేసుకుంది. దీంతోపాటు ప్రపంచస్థాయిలో నిర్ధారించే టాప్ 100 విమానాశ్రయాల్లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ 64 స్థానంలో నిలిచిందని ఆగస్టు 9న జీఎంఆర్ వర్గాలు వెల్లడించాయి. గతంలో 71వ ర్యాంకు ఉండేదని పేర్కొన్నాయి.
ఆన్‌లైన్ ద్వారా స్కైట్రాక్స్ విమాన ప్రయాణికుల అభిప్రాయాలు, వారి సంతృప్తిని కొలమానంగా చేసుకుని అవార్డులను అందజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 550 విమానాశ్రయాల్లోని ప్రయాణికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులను ప్రకటిస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యుత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా స్కైట్రాక్స్ అవార్డు–2021కు ఎంపికైన విమానాశ్రయం?
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(శంషాబాద్ ఎయిర్‌పోర్ట్)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : కోవిడ్ పరిస్థితుల్లో ఆధునిక సాంకేతికతతో ప్రయాణికులకు మెరుగైన సేవలందించినందుకు...