సియెర్రా లియోన్ అధ్యక్షుడితో ఉపరాష్ట్రపతి భేటీ
Sakshi Education
సియెర్రా లియోన్ అధ్యక్షుడు జూలియస్ మాడా బయోతో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు భేటీ అయ్యారు.
సియెర్రా లియోన్ రాజధాని ఫ్రీటౌన్‌లో అక్టోబర్ 13న జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయం, ఆహార శుద్ధి, సమాచార సాంకేతిక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. వ్యవసాయం కోసం సియోర్రా లియోన్‌కు రూ.212 కోట్ల రుణ వెసులుబాటు(క్రెడిట్ లైన్) కల్పిస్తున్నట్లు ఈ సందర్భంగా వెంకయ్య ప్రకటించారు. అలాగే 1000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపించనున్నట్లు పేర్కొన్నారు. సుహృద్భావ సూచికగా సియెర్రా లియోన్‌కు 1000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపించాలని భారత్ నిర్ణయించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సియెర్రా లియోన్ అధ్యక్షుడు జూలియస్ మాడా బయోతో భేటీ
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : ఫ్రీటౌన్, సియెర్రా లియోన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : సియెర్రా లియోన్ అధ్యక్షుడు జూలియస్ మాడా బయోతో భేటీ
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : ఫ్రీటౌన్, సియెర్రా లియోన్
Published date : 15 Oct 2019 06:45PM