సియాచిన్‌లో రక్షణమంత్రి రాజ్‌నాథ్
Sakshi Education
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్‌ను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జూన్ 3న సందర్శించారు.
మంత్రితోపాటు ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్‌రావత్, ఉత్తర కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ రణ్‌బీర్‌సింగ్ ఉన్నారు. దేశ సేవకు తమ పుత్రులను అనుమతించిన సైనికుల తల్లిదండ్రులకు స్వయంగా తానే కృతజ్ఞతలు తెలుపుతూ లేఖలు రాస్తానని చెప్పారు. సియాచిన్‌లో భద్రతాదళాల సన్నద్ధతపై ఉన్నతస్థాయి కమాండర్లతో సమీక్షించారు. సియాచిన్ గ్లేసియర్‌ను రక్షించే క్రమంలో 1100 మందికిపైగా సైనికులు అమరులయ్యారు. సముద్ర మట్టం నుంచి 12వేల అడుగులకుపైగా ఎత్తులో సియాచిన్ యుద్ధక్షేత్రం ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సియాచిన్ గ్లేసియర్‌ను సందర్శించిన రక్షణమంత్రి
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : రాజ్‌నాథ్‌సింగ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : సియాచిన్ గ్లేసియర్‌ను సందర్శించిన రక్షణమంత్రి
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : రాజ్‌నాథ్‌సింగ్
Published date : 04 Jun 2019 05:45PM