సిస్టర్ థ్రెసియాకు సెయింట్‌హుడ్
Sakshi Education
భారత్‌కు చెందిన సిస్టర్ మరియం థ్రెసియా చిరమెల్ మంకిడియాన్‌కు ‘పునీత హోదా’ (సెయింట్‌హుడ్)ను పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించారు.
వాటికన్ సిటీలో అక్టోబర్ 13న జరిగిన కార్యక్రమంలో మరియంతో పాటు ఇంగ్లండ్‌కు చెందిన కార్డినల్ జాన్‌హెన్రీ న్యూమన్, స్విట్జర్లాండ్‌కు చెందిన నన్ మార్గెరెట్ బేయస్, బ్రెజిల్‌కు చెందిన సిస్టర్ డల్స్ లోపెస్, ఇటలీ నన్ గ్యూసెప్పిన వానినిలను కూడా దైవ దూతలుగా పోప్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి భారత విదేశాంగ శాఖ సహాయమంత్రి వీ మురళీధరన్ హాజరయ్యారు. సెయింట్‌హుడ్ పొందిన ఐదుగురిలో ముగ్గురు మహిళలున్నారు.
కేరళలోని శతాబ్దాల చరిత్ర కలిగిన సైరో మలబార్ కేథలిక్ చర్చ్ లేదా చర్చ్ ఆఫ్ మలబార్ సిరియన్ కేథలిక్స్ నుంచి ఇప్పుడు సెయింట్ మరియం థ్రెషియాతో కలిపి నలుగురు సెయింట్స్ ఉన్నారు. ఈ చర్చ్ నుంచి 2008లో సిస్టర్ అల్ఫోన్సా సెయింట్‌హుడ్ పొందారు. ఆ తరువాత 2014లో ఫాదర్ కురియాకోస్ ఎలియాస్ చావర, సిస్టర్ యూఫ్రేసియా(యూఫ్రేసియమ్మగా చిరపరిచితం)లకు కూడా ఈ హోదా లభించింది.
కేరళలోని త్రిచూర్ దగ్గరలోని పుతెంచిరలో తోమ, తాండ దంపతులకు 1876, ఏప్రిల్ 26న సిస్టర్ థ్రెసియా జన్మించారు. 1902లో జోసెఫ్ విద్యాతిల్‌ను తన గురువుగా స్వీకరించారు. 1904లో తన పేరుకు మరియంను చేర్చుకున్నారు. 1914 మే నెలలో ‘కాంగ్రెగెషన్ ఆఫ్ ద సిస్టర్స్ ఆఫ్ ద హోలీ ఫ్యామిలీ’ని ప్రారంభించారు. 1926 జూన్ 8న, తన 50 ఏళ్ల వయసులో మరణించారు. 2000వ సంవత్సరంలో పోప్ సెయింట్ జాన్‌పాల్2, మరియం థ్రెసియాకు ‘బ్లెస్డ్’ హోదాను ప్రకటించారు. సిస్టర్ థ్రెషియా చేసిన ఒక అద్భుతాన్ని నిర్ధారించిన పోప్ ఫ్రాన్సిస్ 2019, ఫిబ్రవరి 12న ఆమెను సెయింట్‌హుడ్‌కు అర్హురాలిగా ప్రకటించారు.

Published date : 14 Oct 2019 05:53PM