సిన్సినాటి మాస్టర్స్ చాంపియన్‌గా జొకోవిచ్
Sakshi Education
వెస్టర్న్ అండ్ సదరన్ టెన్నిస్ టోర్నమెంట్ (సిన్సినాటి మాస్టర్స్)లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ చాంపియన్‌గా అవతరించాడు.
భారత కాలమానం ప్రకారం ఆగస్టు 30న ముగిసిన సిన్సినాటి మాస్టర్స్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 1-6, 6-3, 6-4తో మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)పై గెలిచి విజేతగా నిలిచాడు. విజేత జొకోవిచ్‌కు 2,85,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 కోట్లు), 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ రావ్‌నిచ్‌కు 1,85,015 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. కోటీ 35 లక్షలు), 600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
ఈసారి న్యూయార్క్‌లో...
వాస్తవానికి ప్రతి యేటా సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ టోర్నీ ఒహాయో రాష్ట్రంలోని సిన్సినాటి నగరంలో జరుగుతుంది. ఈసారి కరోనా కారణంగా వేదికను సిన్సినాటి నుంచి న్యూయార్క్‌కు మార్చారు.
ఏకై క క్రీడాకారుడిగా...
జొకోవిచ్ కెరీర్‌లో ఇది 35వ మాస్టర్స్ సిరీస్ టైటిల్ కావడం విశేషం. ఈ క్రమంలో అత్యధిక మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా రాఫెల్ నాదల్ (35 టైటిల్స్-స్పెయిన్) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. అంతేకాకుండా ఈ విజయంతో అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సర్క్యూట్‌లో జరిగే తొమ్మిది వేర్వేరు మాస్టర్స్ సిరీస్ టైటిల్స్‌ను కనీసం రెండుసార్లు చొప్పున గెలిచి ‘కెరీర్ గోల్డెన్ మాస్టర్స్’ ఘనత సాధించిన ఏకై క క్రీడాకారుడిగా జొకోవిచ్ కొత్త చరిత్ర సృష్టించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వెస్టర్న్ అండ్ సదరన్ టెన్నిస్ టోర్నమెంట్ (సిన్సినాటి మాస్టర్స్) విజేత
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : నొవాక్ జొకోవిచ్
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా

Published date : 31 Aug 2020 05:45PM