Skip to main content

సినోవాక్‌ టీకాకు డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర అనుమతి

చైనాకు చెందిన దిగ్గజ ఫార్మా కంపెనీ సినోవాక్‌ తయారుచేసిన సినోవాక్‌ కరోనా వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా వినియోగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) జూన్ 1న అత్యవసర అనుమతులిచ్చింది.
Current Affairs
చైనా నుంచి ఇప్పటికే సైనోఫార్మ్‌ వ్యాక్సిన్‌ డబ్ల్యూహెచ్‌ఓ అంతర్జాతీయ అనుమతులు పొందిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వ్యాక్సిన్ల లోటు ఏర్పడిన తరుణంలో మరిన్ని వ్యాక్సిన్లు ఉండటం అత్యవసరమని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. కోవ్యాక్స్‌ ఫెసిలిటీ ద్వారా ప్రపంచంలోని పేద దేశాలకు వ్యాక్సిన్లనుఅందించాల్సిందిగా వ్యాక్సిన్‌ ఉత్పత్తి కంపెనీలను కోరింది.

పాలిచ్చే తల్లులకు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌
కోవిడ్‌–19 నేపథ్యంలో పాలిచ్చే తల్లులకు ఇంటి నుంచి పని చేసే సదుపాయాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. తల్లీ బిడ్డల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పసిబిడ్డలకు ఏడాది వచ్చే వరకు తల్లులకు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ ఇవ్వాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించినట్టుగా కార్మిక శాఖ జూన్ 1న ఒక ప్రకటనలో వెల్లడించింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : చైనాకు చెందిన దిగ్గజ ఫార్మా కంపెనీ సినోవాక్‌ తయారుచేసిన సినోవాక్‌ కరోనా వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా వినియోగించేందుకుఅత్యవసర అనుమతి
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)
ఎందుకు :కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు...
Published date : 04 Jun 2021 12:26PM

Photo Stories