Skip to main content

సీసీఎంబీ, అపోలో మధ్య భాగస్వామ్య ఒప్పందం

సీఎస్‌ఐఆర్-సెంటర్ ఫర్ సెల్యులార్, మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ), అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రెసైస్ మధ్య భాగస్వామ్యం కుదిరింది.
Current Affairs
ఈ ఒప్పందంలో భాగంగా కోవిడ్-19 నిర్ధారణకై సీఎస్‌ఐఆర్-సీసీఎంబీ అభివృద్ధి చేసిన డ్రై స్వాబ్ టెస్ట్ కిట్స్ తయారీ, వాణిజ్యీకరణ బాధ్యతలను అపోలో చేపడుతుంది. సురక్షితమైన ఈ కిట్స్ ధర తక్కువగా ఉండడంతోపాటు నిర్ధారణ పరీక్ష ఫలితాలను వేగంగా తెలుసుకోవచ్చు. వీటిని అపోలో ఆసుపత్రుల ద్వారా అందుబాటులోకి తెస్తారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రెసైస్‌తో భాగస్వామ్యం
ఎప్పుడు : డిసెంబర్ 10
ఎవరు : సీఎస్‌ఐఆర్-సెంటర్ ఫర్ సెల్యులార్, మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ)
ఎందుకు : సీఎస్‌ఐఆర్-సీసీఎంబీ అభివృద్ధి చేసిన కోవిడ్ కిట్‌లను అపోలో ఆసుపత్రుల ద్వారా అందుబాటులోకి తెచ్చెందుకు
Published date : 15 Dec 2020 06:02PM

Photo Stories