సీఓపీ-13ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
Sakshi Education
వన్య వలస జాతుల పరిరక్షణపై గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరుగుతున్న 13వ ‘‘కాన్ఫెరెన్స్ ఆఫ్ పార్టీస్(సీఓపీ-13) ఆఫ్ ద కన్వెన్షన్ ఆన్ ది కన్సర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ ఎనిమల్స్(సీఎంఎస్)’’ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 17న వీడియో మాధ్యమం ద్వారా ప్రసంగించారు.
పర్యావరణానికి హాని కలగని రీతిలో సుస్థిర, సంతులిత అభివృద్ధి సాధించడం భారత్ అవలంబిస్తున్న విధానమని ఈ సందర్భంగా మోదీ స్పష్టం చేశారు. ఉష్ణోగ్రతలో పెరుగుదల 2 డిగ్రీల సెల్సియల్ లోపే ఉండాలన్న పారిస్ పర్యావరణ ఒప్పందాన్ని అమలు చేస్తున్న అతికొద్ది దేశాల్లో భారత్ ఒకటని గుర్తు చేశారు.
సీఓపీ-13కి స్లోగన్ థీమ్ : ‘వలస జాతులు ఈ భూగ్రహాన్ని అనుసంధానిస్తాయి. మనం ఉమ్మడిగా వాటికి ఆహ్వానం పలుకుదాం’
భారత్‌కు అధ్యక్ష బాధ్యతలు: సీఎంఎస్ సీఓపీ సదస్సు అధ్యక్ష బాధ్యతలను ఫిలిప్పీన్స్ నుంచి భారత్ అధికారికంగా స్వీకరించింది. 2023 వరకు ఈ బాధ్యతల్లో భారత్ కొనసాగనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీఎంఎస్ సీఓపీ సదస్సును ఉద్దేశించి ప్రసంగం
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : గాంధీనగర్, గుజరాత్

Published date : 18 Feb 2020 05:39PM