Skip to main content

సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయి పదవీ విరమణ

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నవంబర్ 17న పదవీ విరమణ చేశారు.
గతేడాది అక్టోబర్ 3న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మొత్తం 13 నెలలు విధులు నిర్వహించారు. అయోధ్య వివాదానికి ముగింపు పలకడం, రఫేల్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్, ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం తదితర చరిత్రాత్మక తీర్పులు ఆయన హయాంలోనే వెలువడ్డాయి.

క్విక్ రివ్యూ:
ఏమిటి:
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి పదవీ విరమణ
ఎప్పుడు: నవంబర్ 17, 2019
ఎవరు: జస్టిస్ రంజన్ గొగొయి
Published date : 18 Nov 2019 05:36PM

Photo Stories