సీఏసీకి శాంత రంగస్వామి రాజీనామా
Sakshi Education
భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ శాంత రంగస్వామి... క్రికెట్ సలహా మండలి (సీఏసీ)కి సెప్టెంబర్ 29న రాజీనామా చేసింది.
అలాగే భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) నుంచి కూడా వైదొలిగింది. దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ నేతృత్వంలోని సీఏసీలో సభ్యురాలిగా ఉన్న శాంత... ఇటీవల టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికలో పాల్గొన్నారు. దీంతో ఆమె విరుద్ధ ప్రయోజనాల పరిధిలోకి వస్తారంటూ మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడు సంజీవ్ గుప్తా బీసీసీఐ ఎథిక్స్ అధికారికి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో పదవుల నుంచి శాంత వైదొలగారు.
Published date : 30 Sep 2019 05:51PM