Skip to main content

సీఎస్‌ఐఆర్ రూరల్ డెవలప్‌మెంట్ అవార్డు విజేత?

హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్త(ఐఐసీటీ) డాక్టర్ ఎస్.శ్రీధర్‌కు సీఎస్‌ఐఆర్ అవార్డ్ ఫర్ ఎస్ అండ్ టీ ఇన్నోవేషన్స్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్(సీఏఐఆర్‌డీ) అవార్డు లభించింది.
Current Affairs
ఐఐసీటీలోని ప్రాసెస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్న డాక్టర్ శ్రీధర్ 2017కిగాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో తాగునీటి శుద్ధి కోసం శ్రీధర్ అభివృద్ధి చేసిన నానోఫిల్ట్రేషన్ రివర్స్ ఆస్మాసిస్ యంత్రాలను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఫ్లోరోసిస్ నివారణకు శ్రీధర్ చేసిన కృషి ప్రశంసలు అందుకుంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : సీఎస్‌ఐఆర్ అవార్డ్ ఫర్ ఎస్ అండ్ టీ ఇన్నోవేషన్స్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్(సీఏఐఆర్‌డీ) అవార్డు విజేత
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : ఐఐసీటీ డాక్టర్ ఎస్.శ్రీధర్
Published date : 02 Oct 2020 05:17PM

Photo Stories