Skip to main content

సీఎం ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికైన ముఖ్యమంత్రి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ‘సీఎం ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు స్కోచ్ గ్రూపు ఎంపిక చేసింది.
Current Affairs
ఫిబ్రవరి 16న ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌కు స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ ఈ అవార్డును అందజేశారు. పరిపాలనలో సంస్కరణలు, విప్లవాత్మక పథకాలతో సంక్షేమాన్ని ప్రజల ముంగిటికే తెచ్చినందుకుగాను ఏపీ సీఎంను ఈ అవార్డుకు ఎంపిక చేశామని స్కోచ్ గ్రూప్ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనలో విప్లవాత్మక మార్పులతో పారదర్శకతకు పెద్దపీట వేసిందని స్కోచ్ గ్రూప్ దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. పాలనలో ఉత్తమ ప్రతిభ విభాగంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : స్కోచ్-సీఎం ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికైన ముఖ్యమంత్రి?
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎందుకు : పరిపాలనలో సంస్కరణలు, విప్లవాత్మక పథకాలతో సంక్షేమాన్ని ప్రజల ముంగిటికే తెచ్చినందుకుగాను
Published date : 17 Feb 2021 05:47PM

Photo Stories