Skip to main content

సీఏఏకు వ్యతిరేకంగా బెంగాల్ అసెంబ్లీ తీర్మానం

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీ జనవరి 27న ఆమోదించింది.
Current Affairsరాజ్యాంగానికి, మానవత్వానికి వ్యతిరేకంగా ఉన్న పౌరసత్వ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేరళ, రాజస్తాన్, పంజాబ్ రాష్ట్రాలు ఇప్పటికే తీర్మానాలను ఆమోదించగా.. తాజాగా ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్ చేరింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా తీర్మానం
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ
Published date : 28 Jan 2020 05:38PM

Photo Stories