సీఆర్‌డీఏ స్థానంలో ఏఎంఆర్‌డీఏ ఏర్పాటు
Sakshi Education
సీఆర్‌డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) రద్దు బిల్లును ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జూలై 31న ఆమోదించడంతో ఇక ఆ సంస్థ కనుమరుగుకానుంది.
ఆ స్థానంలో ఏఎంఆర్‌డీఏ (అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఏర్పాటు కానుంది. సీఆర్‌డీఏ కార్యకలాపాలన్నీ ఇకపై ఏఎంఆర్‌డీఏ నిర్వహిస్తుంది. సీఆర్‌డీఏ ఉద్యోగులంతా ఏఎంఆర్‌డీఏ ఉద్యోగులుగా మారతారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీఆర్‌డీఏ స్థానంలో ఏఎంఆర్‌డీఏ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : జూలై 31
ఎవరు : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
- భూసమీకరణ సహా రాజధాని వ్యవహారాలన్నీ ఈ సంస్థే నిర్వహిస్తుంది. సీఆర్‌డీఏ చేసుకున్న అగ్రిమెంట్లు, కాంట్రాక్టులన్నీ ఇకపై ఏఎంఆర్‌డీఏకిందకు వస్తాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇప్పుడు సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న ప్రాంతమంతా ఏఎంఆర్‌డీఏకిందకు వస్తుంది. రాజధాని ప్రాంత సమగ్ర అభివృద్ధికి ఏఎంఆర్‌డీఏ కృషి చేస్తుంది.
- 2014 డిసెంబర్‌లో టీడీపీ హయాంలో రాజధాని నిర్మాణం కోసం ప్రత్యేక చట్టం ద్వారా సీఆర్‌డీఏఏర్పాటైంది.
- అప్పటివరకూ ఉన్న వీజీటీఎం ఉడా (విజయవాడ–గుంటూరు–తెనాలి–మంగళగిరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) స్థానంలో సీఆర్‌డీఏను ఏర్పాటు చేశారు.
- ‘వీజీటీఎం ఉడా’ 2014లో ‘సీఆర్‌డీఏ’గా మారగా ఇప్పుడు ‘ఏఎంఆర్‌డీఏ’గాకొత్తరూపం దాల్చనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీఆర్‌డీఏ స్థానంలో ఏఎంఆర్‌డీఏ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : జూలై 31
ఎవరు : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
Published date : 02 Aug 2020 10:55AM