సీఐఐ సమావేశంలో నిర్మలా సీతారామన్
Sakshi Education
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆగస్టు 9న నిర్వహించిన పరిశ్రమల సమాఖ్య సీఐఐ జాతీయ మండలి సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మంత్రి నిర్మలా మాట్లాడుతూ... మందగమన సంకేతాలతో సతమతమవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్రప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఎకానమీకి తోడ్పాటునిచ్చే చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఒకే అభిప్రాయంతో ఉన్నాయన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద కంపెనీలు తప్పనిసరిగా నిర్దేశిత మొత్తం కేటాయించకపోతే తీసుకునే కఠిన చర్యలను ప్రభుత్వం మరోసారి సమీక్షిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు మార్కెట్ వర్గాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతోనూ మంత్రి సమావేశమయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పరిశ్రమల సమాఖ్య సీఐఐ జాతీయ మండలి సమావేశంలో కేంద్ర మంత్రి
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : పరిశ్రమల సమాఖ్య సీఐఐ జాతీయ మండలి సమావేశంలో కేంద్ర మంత్రి
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 10 Aug 2019 07:31PM