సిద్ధగంగ మఠాధిపతి శివకుమార స్వామి శివైక్యం
Sakshi Education
కన్నడనాట మహారుషి, అభినవ బసవణ్ణగా పేరుపొందిన తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి, పద్మభూషణ్, కర్ణాటక రత్న పురస్కారాల గ్రహీత డాక్టర్ శ్రీ శివకుమార స్వామి (111) శివైక్యం చెందారు.
వీరశైవ లింగాయత్ వర్గానికి చెందిన ఆయన కొన్ని నెలలుగా వృద్ధాప్య సంబంధ అనారోగ్యాలతో బాధపడుతూ సిద్ధగంగ మఠంలోనే జనవరి 21న కన్నుమూశారు.
1908, ఏప్రిల్ 1న బెంగళూరుకు సమీపంలోని మాగడి తాలూకా వీరాపుర గ్రామంలో పటేల్ హోనప్ప, గంగమ్మ దంపతులకు చివరి సంతానంగా శివకుమార స్వామి జన్మించారు. 1930 నుంచి ఇప్పటివరకు 9 దశాబ్దాల పాటు సిద్ధగంగా మఠాధిపతిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ఎన్నో సంఘ సేవా కార్యక్రమాలు చేపట్టారు. 2007లో కర్ణాటక ప్రభుత్వం నుంచి కర్ణాటక రత్న అవార్డును, 2015లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి కన్నుమూత
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : శివకుమార స్వామి
ఎక్కడ : తుమకూరు సిద్ధగంగ మఠం, కర్ణాటక

Published date : 22 Jan 2019 05:22PM