Skip to main content

సెరావీక్ గ్లోబల్ ఎనర్జీ అవార్డును ఏ దేశ ప్రధానికి ప్రదానం చేశారు?

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కేంబ్రిడ్జ్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేట్స్ వీక్ (సెరావీక్) గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డు–2021 వరించింది.
Current Affairs ఇంధన సుస్థిరత, పర్యావరణానికి సంబంధించిన నిబద్ధతకు గుర్తింపుగా మోదీకి ఈ అవార్డు దక్కింది. ఆన్‌లైన్‌ విధానంలో జరిగిన సెరావీక్‌ సదస్సు–2021లో భాగంగా మార్చి 5న మోదీకి ఈ అవార్డును ప్రదానం చేశారు. సదస్సును ఉద్దేశించి ప్రధాని మోదీ కీలక ఉపన్యాసం చేశారు.

2016 నుంచి...
ప్రపంచ ఇంధన, పర్యావరణ రంగాలు భవిష్యత్తులో ఎదుర్కోనున్న సవాళ్లకు పరిష్కారాలు, అనువైన విధానాల అమలుకు కృషి చేసే నాయకులకు 2016 నుంచి సెరావీక్‌ ఈ అవార్డును అందజేస్తోంది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి :
సెరావీక్‌ గ్లోబల్‌ ఎనర్జీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ లీడర్‌షిప్‌ అవార్డు–2021 విజేత?
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : ఆన్‌లైన్‌ విధానంలో
ఎందుకు : ప్రపంచ ఇంధన, పర్యావరణ రంగాలు భవిష్యత్తులో ఎదుర్కోనున్న సవాళ్లకు పరిష్కారాలు, అనువైన విధానాల అమలుకు కృషి చేస్తున్నందుకు
Published date : 06 Mar 2021 06:59PM

Photo Stories