Skip to main content

సెంట్రల్ బ్యాంక్ రేటింగ్ అప్‌గ్రేడ్ : మూడీస్

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ దీర్ఘకాలిక దేశీయ, విదేశీ కరెన్సీ డిపాజిట్స్ రేటింగ్‌ను అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అప్‌గ్రేడ్ చేసింది.
ప్రస్తుతం ఈ రేటింగ్ బీఏ3గా ఉంటే దీనిని బీఏ2కు అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు మార్చి 11న తెలిపింది. ఈ రెండు బ్యాంకులకు కేంద్రప్రభుత్వం తగిన తాజా మూలధనం సమకూర్చుతుండడం తమ రేటింగ్ అప్‌గ్రేడ్‌కు కారణమని మూడీస్ పేర్కొంది. కాగా ఇందుకు సంబంధించి ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూనియన్ బ్యాంక్‌లకు ఉన్న బీఏఏ3/పీ-3 రేటింగ్‌ను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కూడా మూడీస్ వివరించింది.

2019, ఫిబ్రవరిలో కేంద్రప్రభుత్వం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.48,200 కోట్ల తాజా మూలధనాన్ని అందించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సెంట్రల్ బ్యాంక్, ఓవర్‌సీస్ బ్యాంక్ డిపాజిట్స్ రేటింగ్ అప్‌గ్రేడ్
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్
Published date : 12 Mar 2019 03:40PM

Photo Stories