సబర్మతి ఆశ్రమంలో ప్రధాని మోదీ
Sakshi Education
మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో ఉన్న సబర్మతి ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు.
ఈ సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీకి ఆయన ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆశ్రయంలోని మ్యూజియంను, ఆశ్రమంలో గాంధీ నివాసం హృదయ కుంజ్‌ను సందర్శించారు. సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయం పంచుకున్నారు. ‘గాంధీజీ స్వప్నమైన స్వచ్ఛభారత్ ఆయన 150వ జయంతి రోజు నిజం కావడం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. ఈ సందర్భంగా నేను ఈ ఆశ్రమంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను’ అని సందర్శకుల పుస్తకంలో రాశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో గాంధీజీ 150వ జయంతి సందర్భంగా రూ. 150 నాణాన్ని మోదీ ఆవిష్కరించారు.
దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చాక 1917లో సబర్మతి ఆశ్రమాన్ని మహాత్మాగాంధీ నెలకొల్పారు. 1930 వరకు ఇక్కడే ఉన్నారు. 1930లో దండియాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమ సందర్శన
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా

Published date : 03 Oct 2019 05:42PM