Skip to main content

శబరిమల ఆలయంలోకి మహిళలు

అన్ని వయసుల స్త్రీలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత తొలిసారిగా ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించారు.
కేరళకు చెందిన కనకదుర్గ(44), బిందు(42) జనవరి 2న ఆలయంలోకి వెళ్లి పూజలు నిర్వహించారు. మలప్పురంకు చెందిన కనకదుర్గ పౌర సరఫరా శాఖలో ఉద్యోగి కాగా, కోజికోడ్‌కు చెందిన బిందు కళాశాల లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.

రుతుస్రావాన్ని కారణంగా చూపుతూ 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు శబరిమల ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26లకు విరుద్ధమని 2018, సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

క్విక్ రివ్యూ :
ఏమిటి : కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళలు
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : కనకదుర్గ, బిందు
Published date : 03 Jan 2019 05:05PM

Photo Stories