సైనికుల ఆర్థిక సాయం 4రెట్లు పెంపు
Sakshi Education
యుద్ధభూమిలో మరణించే సైనికుల కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని నాలుగు రెట్లు పెంచేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అక్టోబర్ 5న సూత్రప్రాయ అంగీకారం తెలిపారు.
ప్రస్తుతం ఈ మొత్తం రూ.2 లక్షలు మాత్రమే ఉండగా.. దీన్ని రూ.8 లక్షలకు పెంచేందుకు మంత్రి అంగీకరించారు. యుద్ధాల్లో 60 శాతం కంటే ఎక్కువ వైకల్యం ప్రాప్తించిన వారికీ ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తారు. పెరిగిన మొత్తాన్ని ఆర్మీ బ్యాటిల్ క్యాజువాలిటీస్ వెల్ఫేర్ ఫండ్ నుంచి ఇస్తారని రక్షణ శాఖ పేర్కొంది. సవరించిన పింఛన్ సదుపాయం, ఆర్థిక సాయం, ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్‌స, ఆర్మీ వెల్ఫేర్ ఫండ్, ఎక్స్‌గ్రేషియా మొత్తాలకు ఇది అదనమని వివరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ైసెనికుల ఆర్థిక సాయం 4రెట్లు పెంపు
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ైసెనికుల ఆర్థిక సాయం 4రెట్లు పెంపు
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
Published date : 07 Oct 2019 06:42PM