Skip to main content

సాయుధ పోరాట యోధుడు బూర్గుల కన్నుమూత

స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు బూర్గుల నర్సింగరావు (89) కన్నుమూశారు.
Current Affairs

గుండె సంబంధిత సమస్యలు, కరోనా కారణంగా హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో జనవరి 18న తుదిశ్వాస విడిచారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నర్సింగరావు... హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సోదరుడు బి.వెంకటేశ్వరరావు కుమారుడు.

నర్సింగరావు గురించి...

  • 1932 మార్చి14న ఉమ్మడి మహబూబ్‌నగర్‌జిల్లా షాద్‌నగర్ సమీపంలోని బూర్గుల గ్రామంలో జన్మించారు.
  • 1955లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) మొదటి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై 1959 వరకు బాధ్యతలు నిర్వహించారు.
  • విద్యార్థి దశలో ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు.
  • 1952లో జరిగిన ముల్కీ ఉద్యమం, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు.
  • తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు అధ్యక్షుడిగా పని చేశారు.
  • సీపీఐ హైదరాబాద్ జిల్లాకమిటీ సభ్యుడిగా పనిచేశారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు కన్నుమూత
ఎప్పుడు : జనవరి 18
ఎవరు : బూర్గుల నర్సింగరావు (89)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : గుండె సంబంధిత సమస్యలు, కరోనా కారణంగా
Published date : 20 Jan 2021 05:53PM

Photo Stories