Skip to main content

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 10న విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు దేశంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. ఏప్రిల్ 11న తొలి దశ ఎన్నికలు, రెండో దశ ఏప్రిల్ 18, మూడో దశ ఏప్రిల్ 23, నాలుగో దశ ఏప్రిల్ 29, ఐదో దశ మే 6న, ఆరో దశ మే 12, ఏడో దశ మే19న నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 23న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకటనతో తక్షణమే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మొదటి దశలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఎప్పుడు : మార్చి 10
ఎవరు : కేంద్ర ఎన్నికల సంఘం
Published date : 11 Mar 2019 04:59PM

Photo Stories