సార్క్ 36వ వ్యవస్థాపక దినోత్సవం
Sakshi Education
ఉగ్రవాదం, హింసకు తావులేని వాతావరణంలోనే సార్క్ దేశాలు పూర్తి సామర్థ్యాలను వినియోగించుకొని అభివృద్ధి సాధించగలవని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
36వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 8న వెలువరించిన సందేశంలో మోదీ ఈ మేరకు పేర్కొన్నారు.
సార్క్ - దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సమాఖ్య
- సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్-సార్క్, 1985 డిసెంబర్ 8న ఏర్పాటైంది.
- మొత్తం 8 దేశాలు (భారత్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, మాల్దీవులు, ఆఫ్ఘనిస్థాన్) దీనిలో సభ్యులుగా ఉన్నాయి. త్వరలో మయన్మార్ తొమ్మిదో సభ్యదేశంగా చేరనుంది.
- దీని ప్రధాన కార్యాలయం నేపాల్ రాజధాని ఖాట్మాండ్‌లో ఉంది.
- దక్షిణాసియా దేశాల మధ్య ప్రాంతీయ సహకారానికి, సామాజిక ప్రగతి, సాంస్కృతికాభివృద్ధి, ఆర్థిక వృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ కూటమి పనిచేస్తోంది.
- ప్రస్తుతం శ్రీలంకకు చెందిన ఎస్ల రువాన్ వీరాకూన్ సార్క్ జనరల్ సెక్రెటరీగా వ్యవహరిస్తున్నారు.
- రెండేళ్లకోసారి జరగాల్సిన సార్క్ శిఖరాగ్ర సదస్సులు 2014 తర్వాత నుంచి నిలిచిపోయాయి.
Published date : 11 Dec 2020 05:51PM