Skip to main content

సాంస్కృతిక కట్టడాలను కాపాడాలి: యునెస్కో

అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం అలుముకున్న తరుణంలో ఇరుదేశాలకు యునెస్కో జనవరి 6న కీలక సూచన చేసింది.
Current Affairsదేశాల్లోని చారిత్రాత్మక, సాంస్కృతిక కట్టడాలను ఇరు దేశాలు పరిరక్షించాలని కోరింది. ఈ మేరకు యునెస్కో డెరైక్టర్ జనరల్ ఆడ్రే అజౌల్ ఇరాన్ దౌత్యవేత్తతో భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు. ఇరాన్, అమెరికాలు 1972లో సంతకం చేసిన ఒప్పందం ప్రకారం సాంస్కృతిక కట్టడాలకు ఎటువంటి నష్టం చేకూర్చకుండా ఉండాలని చెప్పారు. అమెరికా బలగాలపై దాడులు చేస్తే ఇరాన్‌లోని నిర్దిష్ట ప్రాంతాలను ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సాంస్కృతిక కట్టడాలను కాపాడాలి
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : యునెస్కో డెరైక్టర్ జనరల్ ఆడ్రే అజౌల్
ఎందుకు : అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం అలుముకున్న తరుణంలో

మాదిరి ప్రశ్నలు
Published date : 07 Jan 2020 05:36PM

Photo Stories