సాంకేతికత వినియోగంలో... భారత్‌కు ఐక్యరాజ్యసమితి ప్రశంసలు
Sakshi Education
న్యూయార్క్: విభిన్న సంప్రదాయాలు, సంస్కృతులు, భాషలు ఉన్న భారత్.. దేశంలోని వివిధ జన సమూహాల మధ్య ఉన్న తారతమ్యాలను తగ్గించడంలో సమర్థంగా వ్యవహరించిందని ఐక్యరాజ్యసమితి(ఐరాస) ప్రశంసించింది. దీనికోసం డిజిటల్ వేదికను భారత్ సమర్థంగా వినియోగించుకుందని ఐరాస చేసిన అధ్యయనంలో తేలింది.
అంతరాలను తగ్గించేందుకు మొబైల్ టెక్నాలజీతో ఆధార్ గుర్తింపు వ్యవస్థను అనుసంధానం చేసి వినియోగించుకున్న విధానం భవిష్యత్తులో వేరే దేశాల్లో అమలు చేస్తే బాగుంటుందని అధ్యయనంలో పేర్కొంది. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం (డీఈఎస్‌ఈ) ‘ది వరల్డ్ సోషల్ నివేదిక-2020’ పేరిట నివేదికను విడుదల చేసింది. అన్ని రంగాల అభివృద్ధి కోసం డిజిటల్ సాంకేతికతను భారత్ ఎలా వినియోగించుకుందో ఈ నివేదికలో పేర్కొంది. మొబైల్ డిజిటల్ టెక్నాలజీని వేరే సాంకేతికతతో కలిపి ఆర్థిక సేవలను అందరికీ అందుబాటులోకి తెచ్చి అంతరాలను ఎలా తగ్గించాలో భారత్ అనుభవం ఎంతో ఉపయోగకరంగా ఉందని పేర్కొంది. బ్యాంకు ఖాతాలు లేని వారికి ఆధార్ సంఖ్య ఆధారంగా ప్రజలకు ఖాతాలు ఇవ్వాల్సిందిగా 2014లో భారత ప్రభుత్వం బ్యాంకులను ఆదేశించిన విషయాన్ని నివేదికలో పొందుపరిచింది. దీంతో బ్యాంకు ఖాతాలు లేని వారి సంఖ్య సగానికి తగ్గిందని వెల్లడించింది. 2011లో దాదాపు 55.7 కోట్ల మందికి ఖాతాలు లేవని, అదే 2015లో 23.3 కోట్ల మందికి మాత్రమే ఇప్పుడు బ్యాంకు ఖాతాలు లేవని పేర్కొంది. ‘2017 నాటికే 80 శాతం భారత్‌లోని పెద్దలు కనీసం ఒక్క బ్యాంకు ఖాతా కలిగి ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ాంకేతికత వినియోగంలో... భారత్‌కు ఐక్యరాజ్యసమితి ప్రశంసలు
ఎక్కడ: న్యూయార్క్
ఎందుకు: డిజిటల్ వేదికను భారత్ సమర్థంగా వినియోగించుకుందని...
క్విక్ రివ్యూ:
ఏమిటి: ాంకేతికత వినియోగంలో... భారత్‌కు ఐక్యరాజ్యసమితి ప్రశంసలు
ఎక్కడ: న్యూయార్క్
ఎందుకు: డిజిటల్ వేదికను భారత్ సమర్థంగా వినియోగించుకుందని...
Published date : 30 Jan 2020 06:08PM