సాగులో సాంకేతికత వినియోగంపై ఏ సంస్థతో కేంద్రం ఒప్పందం చేసుకుంది?
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ సహా ఆరు రాష్ట్రాల్లో వ్యవసాయంలో సాంకేతికత వినియోగంపై ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్ సాయం అందించనుంది.
ఈ మేరకు ఆ సంస్థతో కేంద్ర వ్యవసాయశాఖ ఏప్రిల్ 14న ఒప్పందం కుదుర్చుకుంది. వ్యవసాయానికి సాంకేతికత తోడైతే రైతులు మరింత లబ్ధి పొందుతారని, ఈ తరం వారు కూడా వ్యవసాయం పట్ల ఆకర్షితులవుతారని అనే అనే ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన మేరకు ఈ ఒప్పందం చేసుకున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు.
ఒప్పందం ప్రకారం... దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు.. ఏపీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హరియాణా, రాజస్థాన్‌ల్లోని 100 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టులో మైక్రోసాఫ్ట్ స్థానిక భాగస్వామి కార్ప్‌డాటాతో కలసి భాగస్వామ్యమైంది. ఈ మేరకు థర్డ్‌పార్టీ ఒప్పందం చేసుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సాగులో సాంకేతికత వినియోగంపై ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్ ఒప్పందం
ఎప్పుడు : ఏప్రిల్ 14
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ : ఏపీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హరియాణా, రాజస్థాన్
ఎందుకు : వ్యవసాయానికి సాంకేతికత తోడైతే రైతులు మరింత లబ్ధి పొందుతారని...

Published date : 15 Apr 2021 05:52PM