సాగు చట్టాలపై సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు
Sakshi Education
మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలుపై జనవరి 12న భారత సుప్రీంకోర్టు స్టే విధించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 12
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : సాగు చట్టాల విషయంలో రైతులకు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగించే దిశగా సూచనలు చేసేందుకు
తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే, ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగించే దిశగా సూచనలు చేసేందుకు నలుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటుచేసింది.
నలుగురు సభ్యులతో ఒక కమిటీ...
పది రోజుల్లోగా ఈ కమిటీ తొలి సమావేశం జరుగుతుందని, తొలి భేటీ నుంచి రెండు నెలల్లోగా సుప్రీంకోర్టుకు సిఫారసులతో కూడిన నివేదికను అందిస్తుందని ధర్మాసనం వివరించింది.
కమిటీ సభ్యులు...
- ఇద్దరు రైతు నేతలు: భారతీయ కిసాన్ యూనియన్, ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ జాతీయ అధ్యక్షుడు భూపీందర్ సింగ్ మన్, షెట్కారీ సంఘటన్(మహారాష్ట్ర) అధ్యక్షుడు అనిల్ ఘన్వత్.
- ఇద్దరు వ్యవసాయ రంగ నిపుణులు: ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ దక్షిణాసియా విభాగం డెరైక్టర్ డాక్టర్ ప్రమోద్ కుమార్ జోషి, వ్యవసాయ ఆర్థిక వ్యవహారాల నిపుణుడు, అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రెసైస్ కమిషన్ మాజీ చైర్మన్ అశోక్ గులాటీ.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 12
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : సాగు చట్టాల విషయంలో రైతులకు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగించే దిశగా సూచనలు చేసేందుకు
Published date : 13 Jan 2021 05:42PM