ర్యాపిడ్‌జెన్ పేరుతో ఇక్రిశాట్‌లో సరికొత్త వ్యవస్థ
Sakshi Education
హైదరాబాద్‌లోని అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్)లో ‘ర్యాపిడ్‌జెన్’ పేరుతో సరికొత్త వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.
ర్యాపిడ్‌జెన్ వ్యవస్థతో ఇప్పటివరకూ పది పన్నెండేళ్ల సమయం పట్టే కొత్త వంగడాల సృష్టిని అతితక్కువ సమయంలో సాధించవచ్చునని, ప్రభుత్వరంగ సంస్థల్లో ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు ఇదే తొలిసారని ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ పీటర్ కార్‌బెరీ ఫిబ్రవరి 14న వెల్లడించారు. ఇక్రిశాట్‌లోని జన్యుబ్యాంకులో మంచి లక్షణాలున్న పురాతన వంగడాలు చాలా ఉన్నాయని.. వాటిని వేగంగా రైతుల పొలాల్లోకి చేర్చేందుకు ర్యాపిడ్‌జెన్ ఉపయోగపడుతుందని వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ర్యాపిడ్‌జెన్ పేరుతో సరికొత్త వ్యవస్థ
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ పీటర్ కార్‌బెరీ
ఎక్కడ : ఇక్రిశాట్, హైదరాబాద్
ఎందుకు : కొత్త వంగడాల సృష్టిని అతితక్కువ సమయంలో సాధించేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ర్యాపిడ్‌జెన్ పేరుతో సరికొత్త వ్యవస్థ
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ పీటర్ కార్‌బెరీ
ఎక్కడ : ఇక్రిశాట్, హైదరాబాద్
ఎందుకు : కొత్త వంగడాల సృష్టిని అతితక్కువ సమయంలో సాధించేందుకు
Published date : 15 Feb 2020 05:57PM