Skip to main content

రూ.14.91 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన తొలి భారత కంపెనీ?

రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ సెప్టెంబర్ 10న మరో రికార్డ్ ఘనత సాధించింది.
Current Affairs
రిలయన్స్ అనుబంధ విభాగం రిలయన్స్ రిటైల్‌లో 40 శాతం వరకూ వాటాను అంతర్జాతీయ ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్‌కు విక్రయించనున్నదన్న వార్తల కారణంగా... రిలయన్స్ షేర్ ఇంట్రాడేలో 8.4 శాతం లాభంతో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.2,344ను తాకింది. చివరకు 7 శాతం లాభంతో రూ.2,315 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.14.91 లక్షల కోట్లకు(20,000 కోట్ల డాలర్లు) ఎగసింది. ఈ స్థాయి మార్కెట్ క్యాప్ సాధించిన తొలి భారత కంపెనీ ఇదే. ఒక్క సెప్టెంబర్ 10వ తేదీనే రిలయన్స్ రూ.97,000 కోట్ల మేర మార్కెట్‌క్యాప్ పెరిగింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : రూ.14.91 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన తొలి భారత కంపెనీ
ఎప్పుడు : సెప్టెంబర్ 10
ఎవరు : రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ
Published date : 11 Sep 2020 05:17PM

Photo Stories