Skip to main content

రూ. 5 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో రూ.5,090 కోట్ల విలువైన 28 అభివృద్ధి పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్ 24న శంకుస్థాపన చేశారు.
Current Affairs

ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా... దాదాపు రూ.4,300 కోట్లతో కొత్తగా గండికోట, చిత్రావతి, పైడిపాలెం లిఫ్ట్‌తోపాటు పులివెందుల మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు.

  • గండికోట నుండి 40 రోజుల్లో చిత్రావతి, పైడిపాలెం జలాశయాలను నింపేందుకు నూతనంగా లిఫ్ట్ స్కీంల ఏర్పాటుకు రూ.3015 వేల కోట్ల వ్యయం చేయనున్నారు.
  • పులివెందుల బ్రాంచ్ కెనాల్, సీబీఆర్ కుడికాలువ, జీకేఎల్‌ఐకి సంబంధించి 1.38 లక్షల ఎకరాల భూమిని మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు రూ.1256 కోట్లు ఖర్చు చేయనున్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : రూ. 5 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : పులివెందుల, వైఎస్సార్ కడప జిల్లా
Published date : 26 Dec 2020 05:54PM

Photo Stories