Skip to main content

రష్యాపై నాలుగేళ్ల నిషేధం విధించిన వాడా

వ్యవస్థీకృత డోపింగ్ కారణంగా... ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) రష్యాపై నాలుగేళ్ల పాటు నిషేధం విధించింది. స్విట్జర్లాండ్‌లోని లాసాన్నెలో డిసెంబర్ 9న జరిగిన సమావేశంలో వాడా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నది.
Current Affairsఈ చర్యతో రష్యా క్రీడా సమాజం తీవ్రంగా నష్టపోనుంది. 2020 పారాలింపిక్స్, 2022 యూత్ ఒలింపిక్స్, 2022లో బీజింగ్ ఆతిథ్యమివ్వనున్న వింటర్ ఒలింపిక్స్‌లో రష్యా జట్లేవీ బరిలోకి దిగవు. వచ్చే నాలుగేళ్లలో ఆ దేశం అంతర్జాతీయ క్రీడా పోటీల ఆతిథ్యానికి కూడా పనికిరాదు. అరుుతే 2020లో సెరుుంట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగే యురో చాంపియన్ షిప్‌లో రష్యా పాల్గొనవచ్చు. నిషేధంపై అప్పిల్ చేసుకునేందుకు రష్యాకు 21 రోజుల నిర్ణరుుంచారు.

స్వతంత్ర హోదాలో...
డోపింగ్ మచ్చలేని రష్యా క్రీడాకారులకు ‘వాడా’ కాస్త వెసులుబాటు ఇచ్చింది. వారు స్వతంత్ర హోదాలో (అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ పతాకం కింద) పాల్గొనవచ్చని తెలిపింది. స్వతంత్ర హోదాలో పాల్గొనే రష్యా అథ్లెట్లు పతకాలు గెలిచినా అవి రష్యా ఖాతాలోకి రావు. 2018లో జరిగిన వింటర్ ఒలింపిక్స్‌లో సుమారు 168 మంది రష్యా అథ్లెట్లు తటస్థ జెండాపై పోటీలో దిగారు. 2015 నుంచి అథ్లెటిక్స్‌లో రష్యా ప్లేయర్లపై నిషేధం ఉన్నది.

టాప్-5లో...
రష్యా తొలిసారిగా ఒలింపిక్స్ బరిలో దిగింది 1996లో! అట్లాంటా (అమెరికా) ఆతిథ్యమిచ్చిన సమ్మర్ ఒలింపిక్స్ నుంచి గత ‘రియో’లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ వరకు రష్యా పతకాల పట్టికలో ‘టాప్-5’లోనే నిలిచింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
రష్యాపై నాలుగేళ్ల నిషేధం
ఎప్పుడు : డిసెంబర్ 9
ఎవరు : ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా)
ఎందుకు : వ్యవస్థీకృత డోపింగ్ కారణంగా
Published date : 10 Dec 2019 06:27PM

Photo Stories