రష్యా విడుదల చేయనున్న రెండో కరోనా వ్యాక్సిన్ పేరు?
Sakshi Education
కరోనా వైరస్ ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రయోగాలు ముమ్మరంగా కొనసాగుతున్నారుు.
రష్యా ‘స్పుత్నిక్ వీ’ తర్వాత మరో వ్యాక్సిన్‌ను 2020, అక్టోబర్ 15 నాటికి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. సైబీరియాకి చెందిన వెక్టార్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేస్తున్న ‘ఎపివాక్ కరోనా వ్యాక్సిన్’ను 2020, అక్టోబర్ 15 నాటికి రిజిస్టర్ చేసుకోవచ్చునని రష్యా వినియోగదారుల భద్రతా సంస్థ సెప్టెంబర్ 22న వెల్లడించింది. ఈ వ్యాక్సిన్‌కి సంబంధించిన మొదటి దశ ప్రయోగాలు ఇప్పటికే పూర్తయ్యారుు.
భారత్‌లో స్పుత్నిక్ వీ ప్రయోగాలు...
రష్యా మొదటి వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ మూడో దశ ప్రయోగాలు తుది అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఆసియా, దక్షిణ అమెరికా, మధ్య ప్రాచ్యానికి చెందిన 10 దేశాలు రష్యాతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నారుు. భారత్‌కు సైతం దాదాపు కోటి డోసుల్ని పంపిణీ చేయడానికి రష్యన్ డెరైక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) ఇటీవల ఒప్పందం చేసుకుంది. దీనికి సంబంధించిన ప్రయోగాలను డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ త్వరలో ప్రారంభించనుంది.
చదవండి: స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ సరఫరాకై ఆర్‌డీఐఎఫ్‌తో ఒప్పందం చేసుకున్న భారత సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎపివాక్ కరోనా వ్యాక్సిన్ తయారీకి సన్నాహాలు
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎవరు : రష్యా, వెక్టార్ ఇన్‌స్టిట్యూట్
ఎందుకు : కరోనా వైరస్ ఎదుర్కోవడానికి

Published date : 23 Sep 2020 06:16PM