రోజర్ ఫెడరర్ గౌరవార్థం వెండి నాణేలు
Sakshi Education
ప్రపంచ టెన్నిస్ వేదికలపై విశేష ప్రతిభ కనబరుస్తున్న తమ విఖ్యాత ఆటగాడు రోజర్ ఫెడరర్ గౌరవార్థం వెండి నాణేలు విడుదల చేయాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వం నిర్ణయించింది.
స్విట్జర్లాండ్ కరెన్సీలో 20 ఫ్రాంక్ విలువైన నాణేలపై ఫెడరర్ తన ట్రేడ్‌మార్క్ షాట్ అయిన బ్యాక్‌హ్యాండ్‌తో కనిపిస్తాడు. 2020, జనవరి 23న ఈ నాణేలను లాంఛనంగా జారీ చేస్తామని స్విస్ మింట్ తెలిపింది. ఇప్పటిైకైతే మొత్తం 55 వేల నాణేలను ముద్రించినట్లు పేర్కొంది. జీవించివున్న వ్యక్తి ముఖచిత్రంతో ఇలా నాణేలను విడుదల చేయడం స్విట్జర్లాండ్ చరిత్రలో ఇదే తొలిసారి.
Published date : 04 Dec 2019 05:38PM