రన్నింగ్ ట్రాక్‌పైకి కంబళ వీరుడు శ్రీనివాస గౌడ
Sakshi Education
కంబళ పోటీల్లో ఉసేన్‌బోల్ట్ కంటే వేగంగా పరుగెత్తాడన్న రికార్డు సొంతం చేసుకున్న శ్రీనివాస గౌడ త్వరలో రన్నింగ్ ట్రాక్‌పైకి ఎక్కనున్నాడు.
బురదతో నిండిన పొలంలో బర్రెలతో కలిసి పరుగెత్తే కంబళ పోటీల్లో గౌడ వంద మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలో పూర్తి చేసి సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఇటీవల స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) దక్షిణభారత విభాగం డెరైక్టర్ అజయ్ భేల్, ఇతర అధికారులు కాసరగోడ్ జిల్లాలోని పైవలికేలో శ్రీనివాసతో మాట్లాడి శిక్షణకు ఆయనను ఒప్పించారు. బెంగళూరులోని శాయ్ కేంద్రంలో శ్రీనివాసకు శిక్షణనివ్వనున్నారు. కర్ణాటకలోని మూడుబిద్రిలో నిర్మాణ రంగ కార్మికుడిగా పనిచేస్తున్న శ్రీనివాస 2020 ఏడాది కంబళ పోటీల్లో ఏకంగా 39 పతకాలు కై వసం చేసుకున్నాడు.
Published date : 27 Feb 2020 05:31PM