Skip to main content

రంజీ ట్రోఫీ చాంపియన్‌గా సౌరాష్ట్ర జట్టు

భారత దేశవాళీ క్రికెట్ ప్రధాన టోర్నీ రంజీ ట్రోఫీలో కొత్త చాంపియన్ అవతరించింది.
Current Affairsజైదేవ్ ఉనాద్కట్ నేతృత్వంలోని సౌరాష్ట్ర జట్టు మొదటిసారి విజేతగా నిలిచింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో మార్చి 13న సౌరాష్ట్ర, బెంగాల్ జట్ల మధ్య జరిగినరంజీ ట్రోఫీ201-20ఫైనల్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్‌‌స ఆధిక్యం కారణంగా సౌరాష్ట్రకు ట్రోఫీ ఖరారైంది. బెంగాల్ తమ తొలి ఇన్నింగ్‌‌సలో 381 పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్‌‌సలో 425 పరుగులు చేసిన సౌరాష్ట్రకు 44 పరుగుల ఆధిక్యం దక్కింది. అనంతరం నామమాత్రంగా సాగిన రెండో ఇన్నింగ్‌‌సలో సౌరాష్ట్ర 4 వికెట్ల నష్టానికి 105 పరుగుల వద్ద ఉండగా... ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. విజేత సౌరాష్ట్రకు రూ. 2 కోట్లు ప్రైజ్‌మనీ లభించింది.ఈ టోర్నీలో బెంగాల్ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ సారథ్యం వహించాడు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
రంజీ ట్రోఫీ విజేత 2019-20
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : సౌరాష్ట్ర జట్టు
ఎక్కడ : రాజ్‌కోట్, గుజరాత్
Published date : 14 Mar 2020 06:00PM

Photo Stories