Skip to main content

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా

యాపిల్‌ తరువాత బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదాను సంపాదించుకుంది.
Edu news

ఫ్యూచర్‌బ్రాండ్‌ ఆగస్టు 5న విడుదల చేసిన ఫ్యూచర్‌బ్రాండ్‌ ఇండెక్స్‌ 2020 ఈ విషయాన్ని తెలిపింది.ఈ ఇండెక్స్‌లో శాంసంగ్‌ మూడవ స్థానంలో నిలవగా, ఎన్విడియా, మౌటాయ్, నైకీ, మైక్రోసాఫ్ట్, ఏఎస్‌ఎంఎల్, పేపాల్, నెట్‌ఫ్లిక్స్‌ తరువాత స్థానాల్లో నిలిచాయి. ఇండెక్స్‌లో కొత్తగా 15 సంస్థలకు చోటు లభించగా ఇందులో ఏఎస్‌ఎంఎల్‌ హోల్డింగ్స్, పేపాల్, దనాహెర్, సౌదీ ఆరాంకో, అమెరికన్ టవర్‌ కార్పొరేషన్ లు ఉన్నాయి.

పీడబ్ల్యూసీ ఆధారంగా...
ప్రైస్‌ వాటర్‌ కూపర్స్‌ (పీడబ్ల్యూసీ) గ్లోబల్‌ టాప్‌ 100 కంపెనీల మార్కెట్‌ క్యాప్, ఆర్థిక పటిష్టత, దేశీయ, అంతర్జాతీయ క్రియాశీలత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఫ్యూచర్‌బ్రాండ్‌ఇండెక్స్‌ రూపొందించింది. పీడబ్ల్యూసీ 2020 జాబితాలో రిలయన్స్ ర్యాంక్‌ 91. ప్రస్తుత కంపెనీల క్రియాశీలతతోపాటు వచ్చే కొద్ది సంవత్సరాల్లో ఆయా కంపెనీల పరిస్థితులపైనా మదింపుచేయడం ఇండెక్స్‌ ప్రత్యేకత. తదుపరి ఇండెక్స్‌లో రిలయన్స్ నంబర్‌ 1 స్థానానికి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని ఫ్యూచర్ బ్రాండ్ పేర్కొంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : ఫ్యూచర్‌బ్రాండ్‌ ఇండెక్స్‌ 2020
ఎక్కడ : ప్రపంచంలో

Published date : 09 Aug 2020 12:20PM

Photo Stories