Skip to main content

రిజర్వ్ రేషియోను తగ్గించిన చైనా సెంట్రల్ బ్యాంక్

ఆర్థిక మందగమనంలో ఉన్న చైనా ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి ఆ దేశ సెంట్రల్ బ్యాంక్- పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా కీలక నిర్ణయం తీసుకుంది.
Current Affairsబ్యాంకింగ్‌సహా ఆర్థిక సంస్థల రిజర్వ్ రికై ్వర్‌మెంట్ రేషియో (ఆర్‌ఆర్‌ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు (అరశాతం) తగ్గిస్తున్నట్లు జనవరి 1న వెల్లడించింది. జనవరి 6 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ నిర్ణయంతో చైనా ఆర్‌ఆర్‌ఆర్ 12.50 శాతానికి తగ్గుతుంది. ఈ నిర్ణయం వల్ల రుణాలివ్వడానికి వీలుగా ఫైనాన్‌‌స సంస్థల చేతికి 800 బిలియన్ యువాన్‌లు (114.7 బిలియన్ డాలర్లు) అందుబాటులోకి వస్తాయి. 2019, అక్టోబర్‌తో ముగిసిన త్రైమాసికంలో చైనా వృద్ధిరేటు 30 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిపిందే.

క్విక్ రివ్యూ :
ఏమిటి
: రిజర్వ్ రికై ్వర్‌మెంట్ రేషియో (ఆర్‌ఆర్‌ఆర్) 50 బేసిస్ పాయింట్లు తగ్గింపు
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా
ఎందుకు : ఆర్థిక మందగమనంలో ఉన్న చైనా ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి

మాదిరి ప్రశ్నలు

1. క్రింది వాటిలో చైనాకి చెందిన కరెన్సీ ఏదీ?
1. చెక్ కొరునా
2. యూరో
3. పెసో
4. చైనీస్ యూవాన్

Published date : 02 Jan 2020 06:13PM

Photo Stories