Skip to main content

రెవెన్యూ డివిజన్‌గా హుజూర్‌నగర్

సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు అక్టోబర్ 29న ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 74కు చేరింది. ఇటీవల హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించిన అనంతరం ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా మార్చనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

2019, అక్టోబర్ 21న జరిగిన హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డిపై 43,358 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం పోలైన ఓట్లలో సైదిరెడ్డికి 1,13,095 ఓట్లు రాగా పద్మావతిరెడ్డికి 69,737 ఓట్లు వచ్చాయి.
 
క్విక్‌ రివ్యూ :
ఏమిటి : రెవెన్యూ డివిజన్‌గా హుజూర్‌నగర్ 
ఎప్పుడు : అక్టోబర్‌ 29
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
Published date : 30 Oct 2019 05:32PM

Photo Stories